పవన్ టైటిలా… అస్సలు వద్దు!

భారీ చిత్రాలు నిర్మించే నిర్మాతగా గుర్తింపు పొందిన పొట్లూరి వి ప్రసాద్. ఇప్పుడు గోపిచంద్ హీరో గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  బి. గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ చివరిదశలో ఉంది.
నిర్మాత తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని రూపొందించగా.. నిధుల కొరతతో కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ కి సాయం చేసేందుకు రంగంలోకి దిగారు పీవీపీ. సబ్జెక్ట్ నచ్చడంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న పీవీపీ.. టైటిల్ విషయంలో మాత్రం అభ్యంతరాలు చెబుతున్నారట. ముందుగా ఈ చిత్రానికి ”ఆరడుగుల బుల్లెట్” అనే పేరు నిర్ణయించగా.. పవన్ ను గుర్తు చేసే టైటిల్ గా ఉండటం తో,ఈ విషయంలో పీవీపీ స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. వేరే టైటిల్ నిర్ణయించాల్సిందిగా నిర్మాతకు సూచనలు కూడా జారీ చేశారట.

పీవీపీ ఎంట్రీ ఇవ్వడంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు శరవేగంగా పూర్తి కానుంది.
గోపీచంద్-నయన్ ల మధ్య ఒక డ్యూయెట్ తో పాటు.. ఓ ఐటెం సాంగ్ మిగిలి ఉన్న ఈ మూవీని త్వరలో రిలీజ్ చేసేయోచ్చని తెలుస్తోంది. మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *